Home state news అక్ర‌మ క‌ట్ట‌డాల తొల‌గింపు వేగ‌వంతం : జ‌నార్ధ‌న్‌రెడ్డి

అక్ర‌మ క‌ట్ట‌డాల తొల‌గింపు వేగ‌వంతం : జ‌నార్ధ‌న్‌రెడ్డి

0
0
64

నాలాలపై అక్రమ కట్టడాల తొలగింపు వేగవంతం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి తెలిపారు. నాలాలపై ఆక్రమణల కూల్చివేతపై టౌన్‌ప్లానింగ్, ప్రాజెక్ట్ విభాగం ఇంజనీర్లు, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… గ్రేటర్ హైదరాబాద్‌లోని నాలాలపై తీవ్ర అడ్డంకిగా ఉన్న 844 అక్రమ కట్టడాలను తొలగించే ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఆర్థిక, న్యాయ పరమైన అడ్డంకులు లేని నిర్మాణాలను కూల్చి వేయాలని.. అక్రమంగా నిర్మాణం చేపట్టిన వ్యక్తులకు విధిగా నోటీసులు ముందుగా జారీ చేయాలని స్పష్టం చేశారు. న్యాయపరమైన అడ్డంకులు రాకుండా ఉండేందుకు కేవియట్ ఫైల్ చేయాలని అన్నారు. నాలాల విస్తరణ సందర్భంగా ఇండ్లు కోల్పోతున్న నిరుపేదలకు ఉచితంగా ఇండ్లను కేటాయించడానికి నగరంలో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం, వాంబే పథకాలకు చెందిన రెండు వేల ఇండ్లు సిద్ధంగా ఉన్నాయని జనార్ధన్‌రెడ్డి అన్నారు.

Load More Related Articles
Load More By admin
Load More In state news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

సైరా నరసింహారెడ్డి షూటింగ్ డేట్స్

చిరంజీవి 151వ మూవీ సైరా నరసింహారెడ్డి షూటింగ్ డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. సురేందర్ ర…