Home india news ఎన్టీపీసీ ప్లాంట్ ప్ర‌మాదంపై క‌మిటీ

ఎన్టీపీసీ ప్లాంట్ ప్ర‌మాదంపై క‌మిటీ

0
0
194

రాయ‌బ‌లేరీలో ఉన్న ఎన్టీపీసీ ప్లాంట్‌ను కేంద్ర విద్యుత్ శాఖ స‌హాయ‌మంత్రి రాజ్‌కుమార్ సింగ్ ఇవాళ సంద‌ర్శించారు. అనంత‌రం ఎన్టీపీసీ ప్లాంట్ ప్ర‌మాదంలో మృతుల కుటుంబాల‌కు రూ.20 ల‌క్ష‌లు, తీవ్రంగా గాయ‌ప‌డిన వారికి రూ.10 ల‌క్ష‌లు ప‌రిహారాన్ని ప్ర‌క‌టించారు. స్వ‌ల్పంగా గాయ‌ప‌డిన వారికి రూ.2 ల‌క్ష‌లు ఎక్స్‌గ్రేషియాను తెలిపారు.

రాజ్‌కుమార్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ..ఎన్టీపీసీలో పేలుడు ఘ‌ట‌న‌పై క‌మిటీ వేశామ‌న్నారు. క‌మిటీ నివేదిక ఆధారంగా త‌గు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని రాజ్‌కుమార్ సింగ్ స్ప‌ష్టం చేశారు. కాగా ఉత్తరప్రదేశ్‌లో బుధవారం రారుబరేలిలో జాతీయ థర్మల్‌ విద్యుత్‌ సంస్థ (ఎన్‌టిపిసి)కి చెందిన 500 మెగా వాట్ల విద్యుత్‌ ఉత్పాదక క్షేత్రంలో బాయిలర్‌ పేలిన ఘటనలో 26 మంది చ‌నిపోగా…100 మందికి పైగా గాయ‌ప‌డిన విష‌యం విధిత‌మే.

Load More Related Articles
Load More By admin
Load More In india news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

సైరా నరసింహారెడ్డి షూటింగ్ డేట్స్

చిరంజీవి 151వ మూవీ సైరా నరసింహారెడ్డి షూటింగ్ డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. సురేందర్ ర…