Home india news ఎన్నారైగా మారితే పీపీఎఫ్ ఖాతా రద్దు

ఎన్నారైగా మారితే పీపీఎఫ్ ఖాతా రద్దు

0
0
222

పీపీఎఫ్‌, ఎన్ఎస్‌సీ(జాతీయ పొదుపు ప‌త్రాలు) వంటి చిన్నమొత్తాల పొదుపు పథకాల్లో ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. ఖాతాదారులు తమ వ్యక్తిగత హోదాను ఎన్నారైలుగా మార్చుకున్న పక్షంలో.. మెచ్యురిటీ తీరకముందే వారి ఖాతాలు మూసివేయనున్నట్టు కేంద్ర వెల్లడించింది. ఈ నెల మొదట్లోనే దీనిపై గెజిట్ నోటిఫికేషన్‌ వెలువడింది.

1968 పీపీఎఫ్ పథకానికి చేపట్టిన సవరణ ప్రకారం.. ”ఈ పథకం కింద ఖాతా తెరిచిన పౌరులు, మెచ్యూరిటీ సమయానికి ముందు నాన్ రెసిడెంట్లుగా మారితే, ఎన్నరైలుగా మారిన రోజే వారి ఖాతాలు కూడా మూసివేయడం జరుగుతుంది..” అని పేర్కొన్నారు. మూసివేసిన సదరు ఖాతాలకు కూడా ఆ రోజు దాకా మాత్రమే వడ్డీ చెల్లించడం జరుగుతుందని పేర్కొన్నారు.

పోస్టల్ శాఖ అందిస్తున్న ఎన్ఎస్‌సీ, పీపీఎఫ్, నెలవారీ ఆదాయ పథకం సహా పలు డిపాజిట్లు, పథకాల్లో ఎన్నారైలకు అవకాశం లేదు. దీనిపై కొందరు మీడియా ప్రతినిధులు సంబంధిత అధికారులను ప్రశ్నించగా… తపాలా శాఖ పథకాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నారైలను ఎందుకు అనుమతించడంలేదో తమకు స్పష్టత లేదని పేర్కొనడం గమనార్హం.

Load More Related Articles
Load More By admin
Load More In india news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

సైరా నరసింహారెడ్డి షూటింగ్ డేట్స్

చిరంజీవి 151వ మూవీ సైరా నరసింహారెడ్డి షూటింగ్ డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. సురేందర్ ర…