Home india news జీఎస్టీఆర్-2 రిట‌ర్నుల గడువు పొడగింపు

జీఎస్టీఆర్-2 రిట‌ర్నుల గడువు పొడగింపు

0
0
237

జీఎస్టీ రిటర్న్‌ల దాఖలుకు నిర్దేశించిన గడువును ప్రభుత్వం మరో నెల రోజుల పాటు పొడిగించింది. జూలై నెలకు సంబంధించిన జీఎస్‌టీఆర్-2 దాఖలుకు గతంలో అక్టోబర్ 31వ తేదీగా నిర్ణయించిన గడువును నవంబర్ 30వ తేదీ వరకు, జీఎస్‌టీఆర్-3 దాఖలుకు నవంబర్ 11వ తేదీగా నిర్ణయించిన గడువును డిసెంబర్ 11వ తేదీకి పొడిగిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.

జీఎస్‌టీఆర్-2 లేదా కొనుగోళ్ల రిటర్న్‌లు జీఎస్‌టీఆర్-1తోనూ,జీఎస్‌టీఆర్-3 రిటర్న్‌లు జీఎస్‌టీఆర్-2 రిటర్న్‌లతోనూ సరిపోలాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. జూలై నెలకు సంబంధించిన జీఎస్‌టీఆర్-1 దాఖలుకు గడువుగా నిర్ణయించిన అక్టోబర్ 1వ తేదీ నాటికి 46.54 లక్షల మందికి పైగా వ్యాపారులు తమ రిటర్న్‌లను దాఖలు చేశారని, ఇప్పుడు జీఎస్‌టీఆర్-2 దాఖలు గడువును పొడిగించడంతో 30.81 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు వెసులుబాటు లభిస్తుందని ఆర్థిక శాఖ పేర్కొంది.

Load More Related Articles
Load More By admin
Load More In india news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

సైరా నరసింహారెడ్డి షూటింగ్ డేట్స్

చిరంజీవి 151వ మూవీ సైరా నరసింహారెడ్డి షూటింగ్ డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. సురేందర్ ర…