Home world news డోనాల్డ్ ట్రంప్ ఆసియా టూర్‌

డోనాల్డ్ ట్రంప్ ఆసియా టూర్‌

0
0
200

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆసియా దేశాల్లో పర్యటించనున్నారు. 11 రోజుల పాటు జరిగే ఈ పర్యటన ఇవాళ ప్రారంభమైంది. జపాన్, దక్షిణ కొరియా, చైనా, వియత్నాం, పిలిప్పీన్స్ దేశాల్లో ట్రంప్ పర్యటిస్తారు. సుమారు 25 ఏళ్ల తర్వాత ఓ అమెరికా అధ్యక్షుడు ఆసియాలో ఇంత సుదీర్ఘంగా పర్యటించడం ఇదే మొదటిసారి అవుతుంది.

ఉత్తర కొరియాతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. ఈశాన్య ఆసియా దేశాల్లో ట్రంప్ పర్యటించడం చర్చాంశంగా మారింది. ఉత్తర కొరియాపై వత్తిడి తెచ్చేందుకు చైనాను ట్రంప్ నిలదీసే అవకాశాలున్నాయి. ఆసియా టూర్ మొదలుపెట్టిన ట్రంప్.. మొదటగా హవాయి చేరుకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ దాడి చేసిన పెరల్ హార్బర్ ప్రాంతాన్ని కూడా ట్రంప్ విజిట్ చేయనున్నారు.

Load More Related Articles
Load More By admin
Load More In world news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

సైరా నరసింహారెడ్డి షూటింగ్ డేట్స్

చిరంజీవి 151వ మూవీ సైరా నరసింహారెడ్డి షూటింగ్ డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. సురేందర్ ర…