Home india news నటుడు కమల్‌హాసన్‌పై కేసు

నటుడు కమల్‌హాసన్‌పై కేసు

0
0
200

‘హిందూ ఉగ్రవాదం’ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌పై భారత శిక్షాస్మృతి (ఐపిసి)లోని 500, 511, 298, 295(ఎ), అలాగే 505(సి) సెక్షన్ల కింద కేసు నమోదైంది. దేశంలో అతివాద వర్గాలు హింసాకాండకు ఒడిగట్టడం ఇటీవలి కాలంలో ఎక్కువైందంటూ ఆయన తమిళ పత్రికలో వ్యాసం రాశారు. ఉగ్రవాద కేసులకు సంబంధించి హిందువులు ఎప్పుడూ నేరస్థులు కారని వాదిస్తున్నవారిపై కమల్‌హాసన్ ధ్వజమెత్తారు. ఈ వాదన చేస్తున్న వర్గాల్లో ఉగ్రవాదం ప్రవేశించిందన్నారు.

ఈ వ్యాఖ్యలపై బిజెపి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. పార్టీ నాయకుడు జి.వి.ఎల్.నరసింహారావు మరింత ముందుకు వెళ్లి కమల్‌హాసన్‌ను లష్కరే తోయిబా సంస్థాపకుడు హఫీజ్ సరుూద్‌తో పోల్చాడు. కమల్‌హాసన్ చేసిన ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆయన పి.చిదంబరం, హఫీజ్ సరుూద్ జాబితాలో చేరతారని, అలాగే కాంగ్రెస్ పార్టీకి కొనసాగింపుగానే ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని నరసింహారావు అన్నారు. ఈ వ్యాఖ్యలపై కమల్‌హాసన్‌పై కేసు నమోదైంది. శనివారం దీనిపై విచారణ జరుగుతుంది. ఏకంగా ఐదు సెక్షన్లను కమల్‌హాసన్‌పై నమోదు చేయడాన్ని బట్టి చూస్తే ఈ వ్యాఖ్యల తీవ్రత ఏమిటో స్పష్టమవుతుంది.

ఇందులో ఐపిసి సెక్షన్ 500 అన్నది పరువు నష్టానికి శిక్ష వేయడానికి సంబంధించింది. సెక్షన్ 511 యావజ్జీవం లేదా ఇతర జైలుశిక్షలకు దారితీసే నేరాలకు పాల్పడటానికి సంబంధించింది. అలాగే ఐపిసి 298 ఓ వ్యక్తి మతపరమైన మనోభావాలను దెబ్బతీయాలన్న ఉద్దేశంతో వ్యాఖ్యలు చేయడానికి సంబంధించింది. అలాగే సెక్షన్ 295(ఎ) ఒక మతాన్ని, మనోభావాలను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే చర్యలకు సంబంధించింది. అలాగే 505(సి) ఒక వ్యక్తి లేదా ఒక వర్గాన్ని మరో వ్యక్తి లేదా మరో వర్గంపైకి రెచ్చగొట్టేలా చేయడం. ఈ సెక్షన్ల కింద కమల్‌హాసన్‌పై కేసులు నమోదయ్యాయి.

Load More Related Articles
Load More By admin
Load More In india news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

సైరా నరసింహారెడ్డి షూటింగ్ డేట్స్

చిరంజీవి 151వ మూవీ సైరా నరసింహారెడ్డి షూటింగ్ డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. సురేందర్ ర…