Home world news పాక్‌ వ్యవస్థాపకుడు జిన్నా కుమార్తె మృతి

పాక్‌ వ్యవస్థాపకుడు జిన్నా కుమార్తె మృతి

0
0
196

పాకిస్తాన్‌ వ్యవస్థాపకుడు మహ్మద్‌ అలీ జిన్నా ఏకైక కుమార్తె డైనా వాడియా (98) న్యూయార్క్‌లోని ఆమె స్వగృహంలో గురువారం కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలు శుక్రవారం న్యూయార్క్‌లో జరుగుతాయని ఇక్కడ అధికార వర్గాలు తెలిపాయి. ఆమె కుమారుడు, వాడియా గ్రూప్‌ చైర్మన్‌ నస్లీ ఎన్‌.వాడియా, కుమార్తె డయానా ఎన్‌.వాడియా, మనమలు, మునిమనుమలు అందరూ కూడా ఆమె కన్నుమూసే సమయంలో పక్కనే వున్నారు.

1919లో ఆగస్టు 14 అర్ధరాత్రి సమయంలో తల్లిదండ్రులు జిన్నా, రతన్‌బాయిలు సినిమా చూస్తున్న సమయంలో డైనా జన్మించారని చరిత్రకారుడు స్టాన్లీ వాల్పర్ట్‌ ‘జిన్నా ఆఫ్‌ పాకిస్తాన్‌’ పేరుతో వచ్చిన జిన్నా జీవితచరిత్రలో పేర్కొన్నారు. ముంబయికి చెందిన పార్సీ పారిశ్రామికవేత్త నెవిల్లే వాడియాతో వివాహమైన తర్వాత ఎక్కువగా ముంబయిలోనూ తర్వాత అమెరికాలోనూ ఆమె వున్నారు. ఆమె తన జీవిత కాలంలో కేవలం రెండుసార్లే పాకిస్తాన్‌ సందర్శించారు. తండ్రి జిన్నా మరణించినపుడు, ఆ తర్వాత 2004లో ముషారఫ్‌ ప్రభుత్వ హయాంలో ఒకసారి పాక్‌ను సందర్శించాడు.

Load More Related Articles
Load More By admin
Load More In world news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

సైరా నరసింహారెడ్డి షూటింగ్ డేట్స్

చిరంజీవి 151వ మూవీ సైరా నరసింహారెడ్డి షూటింగ్ డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. సురేందర్ ర…