Home Movie News tollywood బాలకృష్ణ ‘జై సింహా’ ఫస్ట్‌లుక్‌ విడుదల

బాలకృష్ణ ‘జై సింహా’ ఫస్ట్‌లుక్‌ విడుదల

0
0
100

బాలకృష్ణ ‘పైసా వసూల్‌ ‘ తర్వాత కె.ఎస్‌. రవికుమార్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘జై సింహా’. బాలయ్యకు కలిసొచ్చే ‘సింహా’ టైటిల్‌ వచ్చేలా ఈ సినిమా పేరును పెట్టారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను బుధవారం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సి. కళ్యాణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. గత ఏడాది ‘గౌతమి పుత్ర శాతకర్ణి’తో సంక్రాంతి బరిలో దిగాడు బాలకృష్ణ.

ఇప్పుడు కూడా ‘జై సింహా’ చిత్రాన్ని సంక్రాంతికే విడుదల చేయబోతున్నాడు. జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నయన తార, హరి ప్రియ, నటాషా దోషి ఇందులో కథానాయికలు. ప్రస్తుతం అరుకులో చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ బయోపిక్‌లో బాలకృష్ణ నటించనున్నాడు. తేజ దీనికి దర్శకత్వం వహించనున్నాడు. ఇది తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించనున్నారు.

Load More Related Articles
Load More By admin
Load More In tollywood

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

సైరా నరసింహారెడ్డి షూటింగ్ డేట్స్

చిరంజీవి 151వ మూవీ సైరా నరసింహారెడ్డి షూటింగ్ డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. సురేందర్ ర…