Home Movie News tollywood శర్వానంద్‌తో హను రాఘ‌వ‌పూడి

శర్వానంద్‌తో హను రాఘ‌వ‌పూడి

0
0
134

అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథ లతో విజయాలు అందుకొన్నారు హను రాఘవపూడి. నితిన్‌ కథానాయకుడిగా నటించిన లై ఆయన్ని బాగా నిరాశ పరిచింది. అయినప్పటికీ హనుపై యువ హీరోలకు నమ్మకం సడల్లేదు. శర్వానంద్‌ ఇప్పుడు హనుతో ఓ సినిమా చేయడానికి ఉత్సాహం చూపుతున్నట్టు తెలుస్తోంది. లై సమయంలోనే నానికి ఓ కథ చెప్పి ఒప్పించారు హను.

అయితే.. నాని చేతి నిండా సినిమాలు ఉండడంతో ఆ ప్రాజెక్టు ఆలస్యం అవుతోంది. ఇప్పుడు అదే కథని శర్వానంద్‌తో తెరకెక్కిస్తారని తెలుస్తోంది. మహానుభావుడుతో విజయాన్ని అందుకొన్న శర్వా… ఇప్పుడు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ రూపొందించే చిత్రంలో నటిస్తున్నారు. సుధీర్‌ వర్మ దర్శకుడు. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. దీనికి సమాంతరంగానే హను సినిమా కూడా మొదలయ్యే అవకాశాలున్నాయి.

Load More Related Articles
Load More By admin
Load More In tollywood

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

సైరా నరసింహారెడ్డి షూటింగ్ డేట్స్

చిరంజీవి 151వ మూవీ సైరా నరసింహారెడ్డి షూటింగ్ డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. సురేందర్ ర…