Home world news సెల్ఫీలు నచ్చవు – బరాక్‌ ఒబామా

సెల్ఫీలు నచ్చవు – బరాక్‌ ఒబామా

0
0
58

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు సెల్ఫీలే ఇష్టముండవట. ఈ విషయాన్ని ఆయన చికాగోలో బుధవారం జరిగిన ఒబామా ఫౌండేషన్‌ సమావేశంలో వెల్లడించారు. సమావేశానికి హాజరవుతున్నప్పుడు అక్కడ ఉన్న ఒబామా అనుచరులు ఆయనతో కలిసి సెల్ఫీలు దిగాలనుకున్నారు. కానీ ఇందుకు ఒబామా ఒప్పుకోలేదు. అందుకు కారణం ఏంటో కూడా ఒబామా చెప్పారు.

‘ఇలాంటి విషయాల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంటారు. నేను అధ్యక్షుడ్ని అయినప్పుడు ప్రజలు నేరుగా నా కండ్లలోకి చూడలేదు. నాకు షేక్‌హ్యాండ్‌ కూడా ఇవ్వలేదు. నా వద్దకు వచ్చేముందు సెల్ఫీ స్టిక్‌తో వచ్చారు. ఇప్పటికీ అంతే. నేను స్కూల్లో చదివేటప్పుడు దిగిన ఫొటోలు నా వద్ద ఉండి ఉంటే నేను అధ్యక్షుడ్ని అయ్యేవాడిని కాదేమో”.”అలా అని నేను సోషల్‌మీడియా గురించి తప్పుగా మాట్లాడటంలేదు. కానీ ఓ వ్యక్తి మనతో మాట్లాడాలనుకున్నప్పుడు మనం సోషల్‌మీడియాలో బిజీగా ఉంటూ ఫొటోలు తీసుకుంటూ కూర్చుంటే ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడతాయి” అని చెప్పుకొచ్చారు ఒబామా. ఒబామా ఫౌండేషన్‌ సమావేశానికి 60 దేశాలకు చెందిన నేతలు హాజరయ్యారు.

Load More Related Articles
Load More By admin
Load More In world news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

సైరా నరసింహారెడ్డి షూటింగ్ డేట్స్

చిరంజీవి 151వ మూవీ సైరా నరసింహారెడ్డి షూటింగ్ డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. సురేందర్ ర…