September 24, 2019   
Home india news

india news

On the day of her funeral, she stood outside her house as mourners left for the evening. Then she saw her husband guiding a group to their cars.

నటుడు కమల్‌హాసన్‌పై కేసు

‘హిందూ ఉగ్రవాదం’ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌పై భారత శిక్షాస్మృతి (ఐపిసి)లోని 500, 511, 298, 295(ఎ), అలాగే 505(సి) సెక్షన్ల కింద కేసు నమోదైంది. దేశంలో అతివాద వర్గాలు హింసాకాండకు ఒడిగట్టడం ఇటీవలి కాలంలో ఎక్కువైందంటూ ఆయన తమిళ పత్రికలో వ్యాసం రాశారు. ఉగ్రవాద కేసులకు సంబంధించి హిందువులు ఎప్పుడూ నేరస్థులు కారని వాదిస్తున్నవారిపై కమల్‌హాసన్ ధ్వజమెత్తారు. ఈ వాదన చేస్తున్న వర్గాల్లో ఉగ్రవాదం ప్రవేశించిందన్నారు. ఈ వ్యాఖ్యలపై బిజెపి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. పార్టీ నాయకుడు జి.వి.ఎల్.నరసింహారావు …

బిజెపిలోకి ముకుల్ రాయ్

తృణమూల్ కాంగ్రెస్ మాజీ నేత ముకుల్ రాయ్ శుక్రవారం బిజెపిలో చేరారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కుడిభుజంగా ఉండే రాయ్ గత నెలలోనే తృణమూల్‌కు రాజీనామా చేశారు. తృణమూల్‌లో బంధుప్రీతి పెరిగిపోయిందని ఆరోపిస్తూ పార్టీని వీడారు. కాగా ముకుల్‌రాయ్ రాకను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్వాగతించారు. ‘నేను బిజెపిలో చేరాను. బిజెపి మతతత్వపార్టీ కాదన్నది నా విశ్వాసం. రానున్న రోజుల్లో పశ్చిమ బెంగాల్‌లో బిజెపి అధికారంలోకి వచ్చితీరుతుంది’ అని రాయ్ అన్నారు. బిజెపి అధికారంలోకి రాకుండా ఆపడం ఎవరి తరమూ …

జీఎస్టీఆర్-2 రిట‌ర్నుల గడువు పొడగింపు

జీఎస్టీ రిటర్న్‌ల దాఖలుకు నిర్దేశించిన గడువును ప్రభుత్వం మరో నెల రోజుల పాటు పొడిగించింది. జూలై నెలకు సంబంధించిన జీఎస్‌టీఆర్-2 దాఖలుకు గతంలో అక్టోబర్ 31వ తేదీగా నిర్ణయించిన గడువును నవంబర్ 30వ తేదీ వరకు, జీఎస్‌టీఆర్-3 దాఖలుకు నవంబర్ 11వ తేదీగా నిర్ణయించిన గడువును డిసెంబర్ 11వ తేదీకి పొడిగిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. జీఎస్‌టీఆర్-2 లేదా కొనుగోళ్ల రిటర్న్‌లు జీఎస్‌టీఆర్-1తోనూ,జీఎస్‌టీఆర్-3 రిటర్న్‌లు జీఎస్‌టీఆర్-2 రిటర్న్‌లతోనూ సరిపోలాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. …

ఎన్నారైగా మారితే పీపీఎఫ్ ఖాతా రద్దు

పీపీఎఫ్‌, ఎన్ఎస్‌సీ(జాతీయ పొదుపు ప‌త్రాలు) వంటి చిన్నమొత్తాల పొదుపు పథకాల్లో ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. ఖాతాదారులు తమ వ్యక్తిగత హోదాను ఎన్నారైలుగా మార్చుకున్న పక్షంలో.. మెచ్యురిటీ తీరకముందే వారి ఖాతాలు మూసివేయనున్నట్టు కేంద్ర వెల్లడించింది. ఈ నెల మొదట్లోనే దీనిపై గెజిట్ నోటిఫికేషన్‌ వెలువడింది. 1968 పీపీఎఫ్ పథకానికి చేపట్టిన సవరణ ప్రకారం.. ”ఈ పథకం కింద ఖాతా తెరిచిన పౌరులు, మెచ్యూరిటీ సమయానికి ముందు నాన్ రెసిడెంట్లుగా మారితే, ఎన్నరైలుగా మారిన రోజే వారి ఖాతాలు కూడా మూసివేయడం జరుగుతుంది..” అని …

ఎన్టీపీసీ ప్లాంట్ ప్ర‌మాదంపై క‌మిటీ

రాయ‌బ‌లేరీలో ఉన్న ఎన్టీపీసీ ప్లాంట్‌ను కేంద్ర విద్యుత్ శాఖ స‌హాయ‌మంత్రి రాజ్‌కుమార్ సింగ్ ఇవాళ సంద‌ర్శించారు. అనంత‌రం ఎన్టీపీసీ ప్లాంట్ ప్ర‌మాదంలో మృతుల కుటుంబాల‌కు రూ.20 ల‌క్ష‌లు, తీవ్రంగా గాయ‌ప‌డిన వారికి రూ.10 ల‌క్ష‌లు ప‌రిహారాన్ని ప్ర‌క‌టించారు. స్వ‌ల్పంగా గాయ‌ప‌డిన వారికి రూ.2 ల‌క్ష‌లు ఎక్స్‌గ్రేషియాను తెలిపారు. రాజ్‌కుమార్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ..ఎన్టీపీసీలో పేలుడు ఘ‌ట‌న‌పై క‌మిటీ వేశామ‌న్నారు. క‌మిటీ నివేదిక ఆధారంగా త‌గు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని రాజ్‌కుమార్ సింగ్ స్ప‌ష్టం చేశారు. కాగా ఉత్తరప్రదేశ్‌లో బుధవారం రారుబరేలిలో జాతీయ థర్మల్‌ విద్యుత్‌ సంస్థ …

టెక్ మ‌హీంద్రా సీఈవోతో మంత్రి లోకేష్ భేటీ

బెంగ‌ళూరులో ఏపీ ఐటిశాఖ మంత్రి లోకేష్‌ ప‌ర్య‌టిస్తున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా టెక్ మహీంద్రా సీఈవో ర‌విచంద్ర‌న్ తో ఆయ‌న‌ భేటీ అయ్యారు. ఐటీలో శిక్ష‌ణ కోసం ఇంట‌ర్నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజిట‌ల్ టెక్నాల‌జీస్ ఏర్పాటు చేశామ‌ని, అందులో టెక్ మ‌హీంద్ర భాగ‌స్వామ్యం కావాలని కోరారు. 2019లోపు ల‌క్ష ఐటి ఉద్యోగాలు క‌ల్పించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌ని, అందులో భాగంగా విశాఖ‌లో ఉన్న టెక్ మ‌హీంద్రా సెంట‌ర్ లో మ‌రిన్ని ఉద్యోగాలు క‌ల్పించాలని కోరారు. మంత్రి విజ్ఞ‌ప్తికి టెక్ మ‌హీంద్ర ప్ర‌తినిధులు సానుకూలంగా స్పందించారు. ఐవోటీ స్కూల్ …

క‌మ‌ల్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన బీజేపి

దేశంలో ’హిందూ ఉగ్రవాదం’ ఉందంటూ సంచలన వ్యాఖ్య‌లు చేసిన‌ ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌పై బీజేపీ స్పంధించింది. కమల్‌ మానసిక పరిస్థితి బాలేదని, అందుకే ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడింది. హిందూ ఉగ్రవాదం అంటూ పేర్కొన్న కమల్‌ కమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసింది. ’కమల్‌ మానసిక పరిస్థితి బాగాలేదు. ఆయనను ఆస్పత్రిలో చేర్పించి.. చికిత్స అందించాలి. రాజకీయాలు ఇంతగా దిగజారడం మంచిది కాదు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆయన ప్రకటనలు చేస్తున్నారు’ అని బీజేపీ సీనియర్‌ నేత వినయ్‌ కటియార్‌ విమర్శించారు.

కేర‌ళ సీఎంను క‌లిసిన స‌చిన్ టెండూల్క‌ర్‌

కేర‌ళ ముఖ్య‌మంత్రి పినరయి విజయన్‌ను గురువారం మాజీ క్రికెటర్, ఎంపీ సచిన్ టెండూల్కర్ కలిశాడు. ఈ సందర్బంగా సచిన్ మాట్లాడుతూ… ఇండియన్ సూపర్ లీగ్‌లో భాగంగా కేరళ బ్లాస్టర్స్ టీమ్ గురించి సీఎంకు వివరించడానికి ఇక్కడికి వచ్చినట్లు సచిన్ చెప్పాడు. కేరళ బ్లాస్టర్స్ టీమ్‌ను సచిన్‌ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ లీగ్‌లో కేరళ టీమ్ తమ తొలి మ్యాచ్‌ నవంబర్ 17న ఆడనుంది. ఆ మ్యాచ్ చూడటానికి రావాల్సిందిగా సీఎంను కోరినట్లు సచిన్ తెలిపాడు. ఈ టీమ్‌కు సచిన్‌తోపాటు టాలీవుడ్ సూపర్ …

న‌వంబ‌రు 3 నుంచి వ‌ర‌ల్డ్ ఫుడ్ ఇండియా -2017 స‌ద‌స్సు

న‌వంబ‌రు 3 నుంచి ఢిల్లీలో మూడు రోజుల పాటు వ‌ర‌ల్డ్ ఫుడ్ ఇండియా -2017 స‌ద‌స్సు ప్రారంభం కానుంది. విజ్ఞ‌న్ భ‌వ‌న్ లో ప్రారంభం కానున్న ఈ స‌ద‌స్సును ప్ర‌ధాని మోడీ ప్రారంభించ‌నున్నారు. ఈ స‌ద‌స్సులో ఏపీ సీఎం చంద్ర‌బాబు పాల్గొన‌నున్నారు. ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ , ఉత్ప‌త్తి రంగాల్లోని అవ‌కాశాలను ఆయ‌న వివ‌రించ‌నున్నారు. ప‌లుదేశీయ‌, విదేశీ సంస్థ‌ల‌తో అవ‌గాహ‌న ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. అలాగే ఇండియా గేట్ ప్రాంగ‌ణంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిష‌న్ లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక స్టాల్ ఏర్పాటు చేయ‌నుంది.

‘90శాతం మంది ఐఏఎస్‌లు పనిచేయరు’

న్యూదిల్లీ: దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ మరోసారి తన నోటికి పనిచెప్పారు. 90 శాతం మంది ఐఏఎస్‌ అధికారులు పనిచేయడం లేదని వ్యాఖ్యానించారు. అందుకే సచివాలయంలో పనులు నిలిచిపోతున్నాయన్నారు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణను కొందరు ఐఏఎస్‌ అధికారుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అయిన నేపథ్యంలో.. విద్యుత్‌ శాఖలో పెన్షనర్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘90 శాతం మంది ఐఏఎస్‌ అధికారులు పనిచేయరు. దస్త్రాలను తమ వద్దే అట్టిపెట్టుకుంటారు. నేను ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ప్రతిపాదించినప్పుడు వారు (ఐఏఎస్‌ అధికారులు) వ్యతిరేకించారు. …

12Page 1 of 2

Stay Connected

Most Recent

Load more