కలగనటం కాదు, దాన్ని నిజం చేసుకోడానికి ఒకటీరెండు కాదు, ఏకంగా నలభై ఏళ్ల పాటు ప్రయత్నించిన వ్యక్తి జాన్ వెయిన్. అనేక హాలీవుడ్ వెస్టర్న్ చలన చిత్రాలలో గన్ఫైటర్గా ఆయన ప్రేక్షకుల మన్ననలు పొందారు. కానీ, ఉత్తమ నటనకు కొలబద్దలాంటి ఆస్కార్ పురస్కారం మాత్రం ఆయనను దాదాపు నలభై సంవత్సరాలపాటు రిస్తూనే వచ్చింది. మొత్తానికి 1969లో ‘ట్రూ గ్రిట్’ చిత్రంలో మార్షల్ రూబెన్ రూస్టర్గా నటించి, ఆ పాత్రలో చక్కని నటన కనబరిచినందుకు ఆస్కార్ పురస్కారాన్ని అందుకున్నారు. తన నటజీవితంలో ఆయన అందుకున్న ఏకైక …