September 24, 2019   
Home Movie News tollywood

tollywood

The retiring Ohio police officer whose desire to keep his K9 partner sparked a wave of Internet support has a (very) happy ending.

సైరా నరసింహారెడ్డి షూటింగ్ డేట్స్

చిరంజీవి 151వ మూవీ సైరా నరసింహారెడ్డి షూటింగ్ డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో రామ్ చరణ్ ఈ మూవీని నిర్మించనున్నారు. చిరు సరసన నయనతార నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుంటోంది. ఈ నెలాఖరు వరకు ఈ వర్క్ కంప్లీట్ అవుతుంది. డిసెంబర్ మొదటి వారంలో చిరు సైరా మూవీ షూటింగ్ మొదలవుతుంది. అయితే డిసెంబర్ 6ను షూటింగ్ డేట్‌గా చిత్ర బృందం ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ …

‘అదిరింది’ త్వరలో విడుదల

హీరో విజయ్ నటించిన తమిల్ సినిమా మెర్సల్ ని తెలుగులో అదిరిందిగా డబ్బింగ్ చేశారు. శరత్ మరార్ ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్ ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తమిళంలో రెండు వారాల క్రితమే విడుదలై 200 కోట్లు వసూలు చేసింది. గత వారంలోనే ఈ సినిమాని విడుదల చేయాలనీ భావించినా కూడా సెన్సార్ బోర్డ్ సభ్యులు జిఎస్టీ కి వ్యతిరేకంగా ఉన్న డైలాగ్స్ తొలగించాల్సిందే అంటూ ఆదేశించడం జరిగింది. అందుకు నిర్మాతలు నో చెప్పడంతో సెన్సార్ నో చెప్పింది. …

మూడు గీతాలు పూర్తి చేసుకున్న మహేష్ కొత్త సినిమా

సినిమా విజయానికి ఇప్పుడు కథతో పాటు గీతాలు కూడా ఓ భాగమవుతున్నాయి. పాటలు లేకుండా సినిమాలు రావడం ఇప్పుడు అరుదు. మహేష్‌ బాబు వంశీపైడి పల్లి దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్నాడు. ఈ చిత్రానికి బాణీలు సమకూర్చే పనులు న్యూయార్క్‌లోని ప్రారంభించారు. దేవిశ్రీప్రసాద్‌, వంశీపైడి పల్లి కలిసి ఈ సాంగ్స్‌ సిట్టింగ్‌ కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతానికి మూడు గీతాలకు బాణీలు కట్టారట. ఆ మూడు మధురంగా ఉంటాయని దేవిశ్రీ ప్రసాద్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. ఈ సినిమా రెగ్యుల్‌ చిత్రీకరణ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం …

20న సెట్స్‌పైకి వర్మ-నాగార్జునల సినిమా

తెలుగు సినిమా కాన్వాస్‌పై రాంగోపాల్‌ వర్మ-నాగార్జునల ‘శివ’ సినిమా ఒక చెరగని సంతకం చేసింది. ఈ చిత్రం వచ్చి 28 ఏళ్లవుతుంది. ఆ క్రేజీ కాంబినేషన్‌ మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత రిపీటవ్వనుంది. రాంగోపాల్‌ వర్మ ఓ అద్భుతమైన కథ చెప్పాడని, త్వరలోనే సెట్స్‌కు వెళ్లనుందని నాగార్జున స్వయంగా ఇటీవల ‘రాజుగారి గది 2’ ప్రమోషన్స్‌లో భాగంగా చెప్పిన విషయం తెలిసిందే. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ‘శివ” సినిమా మొదటి షాట్‌ను షూట్‌ చేసిన …

బాలకృష్ణ ‘జై సింహా’ ఫస్ట్‌లుక్‌ విడుదల

బాలకృష్ణ ‘పైసా వసూల్‌ ‘ తర్వాత కె.ఎస్‌. రవికుమార్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘జై సింహా’. బాలయ్యకు కలిసొచ్చే ‘సింహా’ టైటిల్‌ వచ్చేలా ఈ సినిమా పేరును పెట్టారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను బుధవారం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సి. కళ్యాణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. గత ఏడాది ‘గౌతమి పుత్ర శాతకర్ణి’తో సంక్రాంతి బరిలో దిగాడు బాలకృష్ణ. ఇప్పుడు కూడా ‘జై సింహా’ చిత్రాన్ని సంక్రాంతికే విడుదల చేయబోతున్నాడు. జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నయన తార, హరి …

శర్వానంద్‌తో హను రాఘ‌వ‌పూడి

అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథ లతో విజయాలు అందుకొన్నారు హను రాఘవపూడి. నితిన్‌ కథానాయకుడిగా నటించిన లై ఆయన్ని బాగా నిరాశ పరిచింది. అయినప్పటికీ హనుపై యువ హీరోలకు నమ్మకం సడల్లేదు. శర్వానంద్‌ ఇప్పుడు హనుతో ఓ సినిమా చేయడానికి ఉత్సాహం చూపుతున్నట్టు తెలుస్తోంది. లై సమయంలోనే నానికి ఓ కథ చెప్పి ఒప్పించారు హను. అయితే.. నాని చేతి నిండా సినిమాలు ఉండడంతో ఆ ప్రాజెక్టు ఆలస్యం అవుతోంది. ఇప్పుడు అదే కథని శర్వానంద్‌తో తెరకెక్కిస్తారని తెలుస్తోంది. మహానుభావుడుతో విజయాన్ని అందుకొన్న …

ఇదే వెడ్డింగ్‌ గిఫ్ట్‌: సమంత

హైదరాబాద్‌: ‘రాజుగారి గది 2’ సినిమా సక్సెస్‌.. ప్రేక్షకులు తనకు ఇచ్చిన పెళ్లి కానుక అని కథానాయిక సమంత అన్నారు. ఆమె, నాగార్జున, సీరత్‌ కపూర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. ఓంకార్‌ దర్శకుడు. పీవీపీ సినిమా సంస్థ నిర్మించింది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ అందుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సక్సెస్‌ మీట్‌ను ఏర్పాటు చేశారు. యూనిట్‌ సభ్యులు మొత్తం ఈ విజయోత్సవంలో పాల్గొని మాట్లాడారు. సమంత మాట్లాడుతూ.. ‘ఈ సినిమా హిట్‌ తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన …

102వ సినిమా కోసం బాలయ్య ఫైట్‌!

హైదరాబాద్‌: బాలకృష్ణ కథానాయకుడిగా కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. నయనతార, నటాషా, హరిప్రియ కథానాయికలు. సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సి.కళ్యాణ్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా క్లైమాక్స్‌ చిత్రీకరణ పూర్తయిందని చిత్ర బృందం తెలిపింది. అరివుమణి-అంబుమణిల సారథ్యంలో ఓ భారీ ఫైట్‌ను చిత్రీకరించారు. ఈ సందర్భంగా నిర్మాత సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ.. ‘అక్టోబర్‌ 5న మొదలైన క్లైమాక్స్‌ ఎపిసోడ్‌ అక్టోబర్‌ 15 వరకూ షూట్‌ చేశాం. ఫైట్‌మాస్టర్లు ఎంతో సహజంగా ఈ పోరాట సన్నివేశాలను డిజైన్‌ చేశారు. మూసాపేటలోని కంటైనర్‌ యార్డ్‌లో కీలక ఎపిసోడ్‌ను చిత్రీకరించాం’ …

Stay Connected

Most Recent

Load more