September 24, 2019   
Home state news

state news

అక్ర‌మ క‌ట్ట‌డాల తొల‌గింపు వేగ‌వంతం : జ‌నార్ధ‌న్‌రెడ్డి

నాలాలపై అక్రమ కట్టడాల తొలగింపు వేగవంతం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి తెలిపారు. నాలాలపై ఆక్రమణల కూల్చివేతపై టౌన్‌ప్లానింగ్, ప్రాజెక్ట్ విభాగం ఇంజనీర్లు, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… గ్రేటర్ హైదరాబాద్‌లోని నాలాలపై తీవ్ర అడ్డంకిగా ఉన్న 844 అక్రమ కట్టడాలను తొలగించే ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆర్థిక, న్యాయ పరమైన అడ్డంకులు లేని నిర్మాణాలను కూల్చి వేయాలని.. అక్రమంగా నిర్మాణం చేపట్టిన వ్యక్తులకు …

టి.టీడీపీ విస్తృత‌స్థాయి స‌మావేశం ప్రారంభం

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టి. టిడీపీ విస్తృత‌స్థాయి స‌మావేశం ప్రారంభ‌మైంది. స‌మావేశానికి చంద్ర‌బాబుతో పాటు ఎల్ . ర‌మ‌ణ‌, రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, నామా నాగేశ్వ‌ర‌రావు , పెద్దిరెడ్డి, మోత్కుప‌ల్లి, ద‌యాక‌ర్ రెడ్డి, గ‌రిక‌పాటి , సండ్ర వెంక‌ట‌వీర‌య్య‌, అర‌వింద్ కుమార్ గౌడ్ , సీత‌మ్మ , పార్టీ శ్రేణులు హాజ‌ర‌య్యారు. షెడ్యూల్ ప్రకారం ఈ ఉదయం 10 గంటలకే ఈ సమావేశం ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, అమరావతిలో సీఆర్డీఏ సమావేశంతో పాటు, డెల్టా షుగర్స్ ఫ్యాక్టరీకి సంబంధించి రైతులతో సమావేశం …

ప్ర‌జాశ్రేయ‌స్సే లక్ష్యం : ఎల్‌.ర‌మ‌ణ‌

ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా టీడీపీ పనిచేస్తోందని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. టీ టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ… రాజకీయ ప్రభుత్వాల గుత్తాధిపత్యాలను బద్దలు కొట్టిన పార్టీ టీడీపీ అన్నారు. తెలంగాణలోని గడీల పాలనకు టీడీపీ చరమగీతం పాడిందన్నారు. నేడు అదే పరిస్థితులు మళ్లీ పునరావృతమవుతున్నాయన్నారు.

వైసీపీ ముఖ్య నేతలతో జగన్ భేటీ

నగరంలోని లోటస్‌పాండ్‌లో వైసీపీ ముఖ్య నేతలతో ఆపార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమావేశమయ్యారు. ఈనెల 6వతేదీ నుంచి జగన్ పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు దాదాపు 3వేల కిలోమీటర్ల పాదయాత్ర జరగనుంది. ఆరునెలలపాటు పాదయాత్ర జరగనుండడంతో గురువారం పార్టీ ముఖ్యనేతలతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా పాదయాత్రతోపాటు పార్టీ బలోపేతంపై చర్చ జరిగింది.

శాసనస‌భా మండలి రేపటికి వాయిదా

తెలంగాణ శాసనసబ, మండలి రేపటికి వాయిదా పడ్డాయి. ప్రశ్నోత్తరాల కార్యక్రమం ముగిసిన వెంటనే ఉభయ సభలనూ రేపటి వాయిదా వేస్తూ సభాధ్యక్షులు ప్రకటించారు. ఉభయ సభలలోనూ కూడా ప్రశ్నోత్తరాల కార్యక్రమం సజావుగా సాగింది. సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు చెప్పారు. అనంతరం అసెంబ్లీని రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మధుసూదనా చారి ప్రకటించారు. అలాగే మండలిని రేపటికి వాయిదా వేస్తే మండలి చైర్మన్ స్వామి గౌడ్ ప్రకటించారు.

తెలంగాణలో నిరుద్యోగ యువతకు శుభవార్త

యువతకు ఇప్పటి వరకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమయింది అనేది టిఆర్ఎస్ ప్రభుత్వంపై అతి పెద్ద విమర్శ. తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోడందరామ్, ప్రతిపక్ష పార్టీలు ఈ అంశాన్ని హైలైట్ చేయడానికి భారీ ఆందోళన కోసం ప్రణాళిక వేస్తున్నారు. ముందుగానే ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వ్యూహాత్మక పద్ధతిలో స్పందించారు. భవిష్యత్తులో లక్ష పోస్టులను పూర్తి చేయాలని ఆయన వాగ్దానం చేశారు. ప్రస్తుత అసెంబ్లీ సెషన్ల సందర్భంగా గ్రూప్-2, అంబేద్కర్ ఓవర్సీస్ పథకంపై అడిగిన ప్రశ్నలపై స్పందించినప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడుతూ …

సింగరేణి కార్మికులకు అడ్వాన్స్‌ ఎరియర్స్‌

హైదరాబాద్‌: సింగరేణి కార్మికులకు రేపు కొత్త వేజ్‌బోర్డు జీతాల ఎరియర్స్‌ నుంచి రూ.51వేల అడ్వాన్స్‌ చెల్లిస్తున్నట్లు సింగరేణి సీఎండీ ఎన్‌. శ్రీధర్‌ తెలిపారు. దీపావళి సందర్భంగా వీటిని రెండ్రోజుల ముందే చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. ఒక్కో కార్మికుడికి రూ.51వేల చొప్పున రూ.265కోట్లు విడుదల చేయనున్నట్లు సింగరేణి సంస్థ తెలిపింది. ఇటీవల జేబీసీసీఐ సమావేశాల్లో అంగీకరించిన కొత్త వేజ్‌బోర్డు జీతాల ఎరియర్స్‌ నుంచి రూ.51వేలు అడ్వాన్స్‌గా చెల్లించడానికి అంగీకారం కుదిరిందని శ్రీధర్‌ తెలిపారు. ఈ వేజ్‌బోర్డ్‌ ఒప్పందం ప్రకారం కొత్త జీతాలు జులై 1, 2016 నుంచి …

శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద

హైదరాబాద్‌: శ్రీశైలం జలాశయానికి మళ్లీ వరద తాకిడి పెరుగుతోంది. గత రెండు రోజులుగా కాస్త తగ్గిన వరద సోమవారం మళ్లీ పెరిగింది. అధికారులు ప్రస్తుతం 4 గేట్ల ద్వారా నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ రాత్రికి మరో రెండు గేట్లు ఎత్తే అవకాశం ఉంది. మరోవైపు సాగర్‌కు వరద తాకిడి పెరుగుతోంది. ప్రస్తుతం సాగర్‌కు ఇన్‌ ఫ్లో 1,57,311 క్యూసెక్కులుగా ఉంది. నీటి మట్టం 552.40 అడుగులకు చేరింది. సాగర్‌లో ప్రస్తుత నీటి నిల్వ 215.09 టీఎంసీలుగా ఉంది. మరోవైపు జూరాల జలాశయానికి …

కారుతో ఢీకొట్టి.. పరారీ ఇద్దరు మహిళలు, చిన్నారికి తీవ్రగాయాలు

ఇంటర్నెట్‌డెస్క్‌: మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో ఒక వ్యక్తి నిర్లక్ష్యంగా కారు నడిపి ఇద్దరు మహిళలు, ఒక చిన్నారిని తీవ్రంగా గాయపరిచాడు. థల్లియా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కారు అతివేగంతో మహిళలను ఢీకొనడం సీసీ టీవీ రికార్డుల్లో నమోదైంది. ఈ ఘటన జరిగిన వెంటనే డ్రైవర్‌ కారుతో సహా పరారయ్యాడు. చుట్టుపక్కల ఉన్నవారు తేరుకునేలోపే కారు అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవరు కోసం గాలిస్తున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి …

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. రోగి మృతి

సుబేదారి: హన్మకొండలోని రోహిణీ ఆసుపత్రిలో సోమవారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. రెండో అంతస్తులోని ఆపరేషన్‌ థియేటర్‌లో విద్యుదాఘాతంతో ఈ ప్రమాదం జరిగినట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. ఆస్పత్రిలోని అత్యవసర విభాగం, ఇతర విభాగాల్లో చికిత్స పొందుతున్న సుమారు 200 మంది రోగులను నగరంలోని మ్యాక్స్‌కేర్‌, ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన జెట్టి కుమారస్వామి(45) అనే రోగి మృతిచెందాడు. ఆయన మూడు రోజుల క్రితమే కాలు ఆపరేషన్‌ నిమిత్తం ఆసుపత్రిలో చేరినట్లు కుటుంబసభ్యులు …

12Page 1 of 2

Stay Connected

Most Recent

Load more