July 17, 2019   
Home world news

world news

Twitter has suspended 125,000 accounts “for threatening or promoting terrorist acts,” the website announced on Friday.

సెల్ఫీలు నచ్చవు – బరాక్‌ ఒబామా

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు సెల్ఫీలే ఇష్టముండవట. ఈ విషయాన్ని ఆయన చికాగోలో బుధవారం జరిగిన ఒబామా ఫౌండేషన్‌ సమావేశంలో వెల్లడించారు. సమావేశానికి హాజరవుతున్నప్పుడు అక్కడ ఉన్న ఒబామా అనుచరులు ఆయనతో కలిసి సెల్ఫీలు దిగాలనుకున్నారు. కానీ ఇందుకు ఒబామా ఒప్పుకోలేదు. అందుకు కారణం ఏంటో కూడా ఒబామా చెప్పారు. ‘ఇలాంటి విషయాల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంటారు. నేను అధ్యక్షుడ్ని అయినప్పుడు ప్రజలు నేరుగా నా కండ్లలోకి చూడలేదు. నాకు షేక్‌హ్యాండ్‌ కూడా ఇవ్వలేదు. నా వద్దకు వచ్చేముందు సెల్ఫీ …

50 మిలియన్ల యూరోల ఖరీదైన పెయిన్ కిల్లర్స్ స్వాధీనం

సుమారు 50 మిలియన్ల యూరోలు విలువ చేసే సింథటిక్ ఓపియమ్ ట్యాబ్లెట్లను ఇటలీ పోలీసులు సీజ్ చేశారు. ఇస్లామిక్ స్టేట్ గ్రూపు ఉగ్రవాదులు ఈ మందులను లిబియాలో అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇండియా నుంచి లిబియాకు సరఫరా చేసిన 24 మిలియన్ల ట్రమడోల్ ట్యాబ్లెట్లను గియో టౌరో పోర్టు వద్ద సీజ్ చేశారు. ట్రమడోల్‌ను పెయిన్ కిల్లర్‌గా పనిచేస్తుంది. జిహాదీలు ఈ డ్రగ్‌ను ఎక్కువగా వాడుతారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఈ ట్యాబ్లెట్లను రెండు యూరోలకు ఒకటి చొప్పున అమ్ముతున్నట్లు అంచనా వేస్తున్నారు. ఉగ్ర సంస్థలకు …

డోనాల్డ్ ట్రంప్ ఆసియా టూర్‌

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆసియా దేశాల్లో పర్యటించనున్నారు. 11 రోజుల పాటు జరిగే ఈ పర్యటన ఇవాళ ప్రారంభమైంది. జపాన్, దక్షిణ కొరియా, చైనా, వియత్నాం, పిలిప్పీన్స్ దేశాల్లో ట్రంప్ పర్యటిస్తారు. సుమారు 25 ఏళ్ల తర్వాత ఓ అమెరికా అధ్యక్షుడు ఆసియాలో ఇంత సుదీర్ఘంగా పర్యటించడం ఇదే మొదటిసారి అవుతుంది. ఉత్తర కొరియాతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. ఈశాన్య ఆసియా దేశాల్లో ట్రంప్ పర్యటించడం చర్చాంశంగా మారింది. ఉత్తర కొరియాపై వత్తిడి తెచ్చేందుకు చైనాను ట్రంప్ నిలదీసే అవకాశాలున్నాయి. ఆసియా …

పాక్‌ వ్యవస్థాపకుడు జిన్నా కుమార్తె మృతి

పాకిస్తాన్‌ వ్యవస్థాపకుడు మహ్మద్‌ అలీ జిన్నా ఏకైక కుమార్తె డైనా వాడియా (98) న్యూయార్క్‌లోని ఆమె స్వగృహంలో గురువారం కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలు శుక్రవారం న్యూయార్క్‌లో జరుగుతాయని ఇక్కడ అధికార వర్గాలు తెలిపాయి. ఆమె కుమారుడు, వాడియా గ్రూప్‌ చైర్మన్‌ నస్లీ ఎన్‌.వాడియా, కుమార్తె డయానా ఎన్‌.వాడియా, మనమలు, మునిమనుమలు అందరూ కూడా ఆమె కన్నుమూసే సమయంలో పక్కనే వున్నారు. 1919లో ఆగస్టు 14 అర్ధరాత్రి సమయంలో తల్లిదండ్రులు జిన్నా, రతన్‌బాయిలు సినిమా చూస్తున్న సమయంలో డైనా జన్మించారని చరిత్రకారుడు స్టాన్లీ వాల్పర్ట్‌ ‘జిన్నా …

ఫెడ్‌రల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లలో మార్పు లేదు

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లలో మరోసారి ఎలాంటి మార్పు జరగలేదు. వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఫెడ్‌ ప్రకటించింది. దీంతో ఈ రేటు 1-1.25శాతం శ్రేణిలో ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థ బాగానే కోలుకుంటోందని, ఉద్యోగాల విపణి మరింత బలోపేతమైందని విధాన కర్తలు అభిప్రాయపడ్డారు. అందుకే వడ్డీరేట్ల పెంపునకు కమిటీ విముఖత వ్యక్తం చేసింది. అంతకముందు 2017లో మూడుసార్లు వడ్డీ రేట్లను పెంచుతామని ఫెడ్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే మార్చి, జూన్‌ల్లో రెండుసార్లు పెంచింది. ఇక డిసెంబర్‌లో జరిగే సమావేశంలో మూడోసారి రేట్ల …

వలస విధాన చట్టాలను మరింత కఠినం చేయాలి – ట్రంప్‌

వలస విధాన చట్టాలను మరింత కఠినతరం చేయాలని ట్రంప్‌ నిర్ణయించుకున్నారు.న్యూయార్క్‌ ఉగ్రదాడి నేపథ్యంలో అమెరికా వలస విధానంపై ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా గ్రీన్‌కార్డు జారీల్లో అనుసరిస్తున్న లాటరీ విధానాన్ని రద్దు చేసేందుకు ట్రంప్‌ ప్రతిపాదించారు. న్యూయార్క్‌లో దాడికి పాల్పడింది ఉజ్బెకిస్థాన్‌కు చెందిన సైఫుల్లోగా గుర్తించిన నేపథ్యంలో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. వైవిధ్య లాటరీ విధానానికి బదులుగా ప్రతిభ ఆధారిత వీసాలు, గ్రీన్‌కార్డులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు లాటరీ పథకం రద్దు కోసం …

అవినీతి రొంపిలో పాకీస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్!

పాకీస్థాన్ మాజీ ప్రధాని నవాబ్ షరీఫ్ ఇంకా అవినీతిలోనే కూరుకు పోయివున్నారు, అకౌంట్ ఎబిలిటీ న్యాయస్థానం లో అవినీతి అభియోగాల కేసు ఎదుర్కోవడానికి, నేడు పాకీస్థాన్ తిరిగి వచ్చారు. ఆయన ఈ శుక్రవారం నాడు న్యాయస్థానం లో హాజరు కావల్సి వుంది. ఆయన తమ భార్య కుల్ సూ మ్ నవాజ్ తో సహా, ఆమె గొంతు కేన్సర్ చికిత్స కోసం లండన్ లో వున్నారు. పాకీస్థాన్ వచ్చే ముందు జియో టివి తో మాట్లాడుతూ, తన భార్య ఆరోగ్య పరిస్థితి బాగోలేనప్పటికీ, తాను …

ప్రార్ధనలో కునికిపాట్లు నిజమే – పోఫ్ ఫ్రాంసిస్

నేను ప్రార్ధన చేసే సమయం లో ఒక్కొక్కప్పుడు నిద్రలోకి జారుకుంటాను, సెయింట్స్ కూడా ప్రార్ధన లో కళ్ళు మూసుకున్నప్పుడు కునికి పాట్లు పడుతూ వుంటారని సాక్షాత్తూ పోఫ్ ఫ్రాంసిస్ ఒప్పుకున్నారు.  సెయింట్ థెరిసా కూడా నిద్రలో జోగుతుండేవారు అన్నారు పోప్ ఫ్రాన్సిస్, 19 వ శతాబ్దపు ఫ్రెంచ్ నన్ ని వుటంకిస్తూ. క్రిష్టియన్స్ నిజానికి తండ్రిభుజాలమీద సేద తీరే పసి పిల్లలలా వుండాలి. 8౦ ఏళ్ళవయసున్నఆర్జెంటీనా కి చెందిన రోమన్ కాథలిక్ చర్చి అధినేత,ఇప్పటికీ జన సముదాయాన్నికలిసి నప్ప్పుడు తన అంతర్గత శక్తినీ, అభినివేశాన్నీ,అత్యుత్సాహాన్నీ …

వాల్ మార్ట్ షోరూంలో దుండగుడి కాల్పులు – ముగ్గురు మృతి

న్యూయార్క్ లో జరిగిన ఉగ్రదాడి నుంచి తేరుకోకముందేఅమెరికాలో మరో కాల్పుల సంఘటన చోటు చేసుకుంది. కొలరాడోలోని వాల్ మార్ట్ షోరూంలోకి ప్రవేశించిన ఓ దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ కాల్పులలో ముగ్గురు మరణించగా, పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులలో ఓ మహిళ ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నుమూసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఆఫ్గనిస్తాన్ చమురు ట్యాంకర్లో బాంబు పేలుడు

ఆఫ్ఘనిస్తాన్ క్యాబూల్ వాయువ్య దిశలో చరికర్ పట్టణంలో ఇంధన ట్యాంకర్లు పేలడంతో కనీసం 15 మంది మృతిచెందగా, 27 మంది గాయపడ్డారు. ఒక స్టిక్కీ బాంబు వలన పేలుడు సంభవించి రెండు ట్యాంకర్లు నాశనం అయ్యాయని ,బస్సులో పలువురు ప్రయాణీకులు మరణానికి గురి అయ్యారని భద్రతా అధికారి ఒకరు తెలిపారు. స్థానిక గవర్నర్కు ప్రతినిధి వహీదా షాకర్, కనీసం 27 మంది గాయపడ్డారు, 15 మంది మరణించారు. కాబుల్ లో ఒక ఆత్మహత్య బాంబర్ ఎనిమిది మంది మరణానికి కారణం అయ్యాడు , ఈ …

12Page 1 of 2

Stay Connected

Most Recent

Load more